31, మే 2011, మంగళవారం

ప్రియరాగాలు ఎపిసోడ్ 1

ఇంట్రో యాంకర్
అమృత రాగాల హరివిల్లు.. మేలు స్వరాల విరిజల్లు... మది మదిని పులకించే స్వరపారిజాతం. ప్రియరాగాలు కార్యక్రమానికి స్వాగతం..
మాంటాజ్
యాంకర్ 1
ప్రతి మనిషికి మొదటి స్నేహం అమ్మే.. ఆ తరువాత అమ్మ పరిచయం చేసే స్నేహితుడు ..సుదూర బంధువు. జీవితాంతం వీడి పోని నేస్తం.. చందమామ. అవును మరి చందమామను చూస్తే ప్రతి పసి పాపకు ఏదో ఆత్మీయ అనుబందం.. ఆ అనుబంధం చందమామను చూసి గోరుముద్దలు తినే దశ నుంచి చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే దశ దాటి..మనవళ్లకూ మనుమరాళ్లకు చందమామను చూపి కథలు చెప్పేదాకా సాగుతుంది. అలా మన జీవితాన్ని పెన వేసుకుంన్న చందమామ నేపద్యంలో వచ్చిన రాగాలే నేటి మన ప్రియరాగాలు.
బ్యాంగ్ ( చందమామ)(రావోయి చందమామ పాట మ్యూజిక్)
యాంకర్ 2
చందమామ రావే.. జాబిల్లి రావే… ఈ పాట వినని వారుండరంటే అదో పెద్ద అతిశయోక్తి కాదు. అసలు పాపాయి వినే తొలి స్వరం అదేనేమో.. ఈ పాట ఇప్పటిది కాదు.. తరలనాటి తరగని వారసత్వ స్వరం....అలనాడు శ్రీరామ చంద్రుడి దగ్గర నుంచి నేటి హైటెక్ బుజ్జాయి వరకు చందనాల చందమామను చూసి ఆడుకోవలసిందే, చందమామను చూపి ఆడించాల్సిందే..
( జందమామా దాయే)( ఆల్ఫా టెక్ట్స్ 3డి)
1.సాంగ్ ఫ్రం సిరివెన్నెల ( చందమామా రావే..)
చందమామ ఓ ఊరడింపు.. ఓ పులకింత… ఓ పలవరింత.. ఓ గిలిగింత. అన్నం తిననని మారాం చేస్తే మాయచేసి తినిపించే ఓ మురిపింత చందమామ.. పున్నమి రేయి చందమామను ఎంత చూసినా తనివి తీరదు. ఆ నెలరాజును రేయంతా చూసినా హాయిగానే ఉంటుంది. ఆ హాయి మరింత మత్తుగా ఉండాలంటే వెన్నెల్లో స్వరాలను మీటి తేనె వానలు కురిపిస్తే అంతకన్నా అదృష్టమేముంటది.
2. క్షణక్షణం( జామురాతి)
అందమైన అమ్మాయిని చూస్తే చందమామలా చక్కగా ఉండని పొగిడేస్తరు. చందమామకైనా మచ్చ ఉంటుంటేమో కానీ తన ప్రియురాలికి లేదని కవిత్వం కుమ్మేస్తరు. అంతేకాదు ఆ నింగి నున్న చందమామ రేయి మాత్రమే వస్తడని.. తన ప్రేయసి మాత్రం పగలే వెన్నెల చిలికే జాబిలమ్మ అని సోపేస్తడు.
3.(శత్రువు పాటపొద్దున్నే పుట్టింది చందమామ)
చందమామ అందాన్ని తన లవర్ కు ఆపాదించుకునేది అబ్బాయిలే కదండోయ్ అమ్మాయిలు కూడా... తమకు చందమామ లాంటి అందగాడు దొరకాలని కోరుకుంటరు. అదృష్టం కలిసొచ్చి అంతటి అందగాడే దొరికిండా.. ఇక ఆ అమ్మాయి ఆనందానికి హద్దులే ఉండవు..
4.( అతడు .. చందమామ )
మీకు తెలుసా..ప్రేయసి మీద అలక తీర్చడానికి డైరెక్ట్ గా బ్రతిమిలాడ కుండా జాబిలమ్మకు కంప్లైంట్ చేసే రొమాంటిక్ జంటలకు కొదవే లేదు.. మబ్బుతునకల మాటున దాగిన వెన్నెలలా అప్పుడప్పుడూ అమ్మాయి కాస్త అలగడం మామూలే.. ఆ వెన్నెల మాటున దాగిన విన్నపాలు వినాలంటే జాబిలమ్మే మౌన ప్రేక్షకుడు, వీక్షకుడు..
5.జాబిలమ్మ నీకు అంత కోపమా
భార్యా భర్తల కోపతాపాలను తీర్చే పెద్దమనిషి కూడా చందమామేనండోయ్.. కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా చందమామకే చెప్పుకుంటరు. ఎందుకంటారా..చల్లగాలిలో చెక్కిళ్లను ముద్దాడి చెంపలను నిమిరే ఆ సరసానికి చంద్రుడే సాక్ష్యం. అందుకే కోప తాపాలప్పుడు కూడా ఆయనకే కంప్లైంట్ చేస్తరు.
6.(రావోయి చందమామ పాట)
చందమామ ప్రేమగీతాలకు, విరహగీతాలకే కాదండోయ్. ఊరడింపుకు కూడా ఇంపైన రాగం పలికించేది జాబిల్లే.. కష్ట సుఖాలు, కృష్ణ పక్షం, శుక్ష పక్షాల్లా వచ్చిపోతుంటయి. ఈ వెలుగు చీకట్లను ముడి పెట్టే పాడు లోకం కూడా ఉందని ఉదహరిస్తూ.. చందమామను ఉపమానంగా వల్లిస్తాడో కవి.. గంగలలో తేనెలలో కడిగిన ముత్యమంతా స్వచ్చంగా ఉందంటడు.
7.చంటి( జాబిలికీ వెన్నెలకు ) పాట
అలసి సొలసిన ప్రియురాలిని. .. మునుమాపు వేళలో ముద్దు ముద్దుగా లాలించాలంటే.. చల్లని చందమామే సోర్స్.. చిన్న తనంలో అమ్మనేర్పిన పాట చందమామ రావే జాబిల్లి రావే.. కానీ. ఓ ప్రియుడు తన ప్రియురాలిని నిద్రబుచ్చేందుకు.. చందమామను అక్కడే ఉంచి వెన్నెలను మాత్రం మెల్లిగా రమ్మంటండు.
8. ప్రేమ దేశం (వెన్నెలా వెన్నెలా..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి